తెలుగు టీవీ షోస్ లో అత్యంత ఆదరణ ఉన్న షో స్టార్ మా లో ప్రతి సంవత్సరం ప్రసారం అయ్యే బిగ్ బాస్ . ప్రస్తుతం 5 వ సీసన్ నడుస్తుంది . ఈ షోని యువత మాత్రమే కాక ఫ్యామిలీ కూడా ఆసక్తిగా చూస్తుంటారు. అలాంటి షో లో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ మరియు సిరి తరచూ హుగ్గులు ,ముద్దులు పెట్టుకోవడం ప్రేక్షకులకు ఏ మాత్రం నచ్చట్లేదు.
దీని పై స్పందిస్తూ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన సిరి అమ్మ గారు తనకు నచ్చట్లేదు అని సిరి మరియు షన్ను కి చెప్పింది. కానీ సిరి మరియు షన్ను అదే వైఖరిని ఇప్పటికి కొనసాగిస్తున్నారు. అమ్మ చెప్పిన మాట కూడ లెక్కచెయ్యకుండా అలాగే కొనసాగించడం బిగ్ బాస్ ప్రేక్షకులకు నచ్చలేదు.
ఇప్పుడు కొత్తగా ఫ్రెండ్షిప్ హుగ్గు అని చేసుకుంటున్నారు. ఇద్దరూ ఇప్పటికే వేరే వారితో ప్రేమలో ఉన్నప్పటికీ తరచూ ఇలా చెయ్యడం తప్పు అని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఒక అమ్మ గా సిరి అమ్మ గారు అలా చెప్పడం తప్పు లేదు. ప్రతిఒక్కరి అమ్మగారు తనకూతురు పద్దతి గా ఉండాలి అని కోరుకుంటుంది.